పోలీసుల నుంచి తప్పించుకోబోయి లోయలోకి పల్టీలు కొట్టిన బస్సు.. ఆరుగురి దుర్మరణం!
- జమ్మూకశ్మీర్ లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘటన
- వేగంగా వెళుతూ అదుపు తప్పిన బస్సు
- 38 మంది ప్రయాణికులకు గాయాలు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు డ్రైవర్ మరోదారిలో బస్సును మళ్లించాడని అన్నారు. వేగంగా వెళుతున్న బస్సు మజాల్తా ప్రాంతం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.