Nifty: మూడు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్.. నేడు లాభాల జోరు!

  • కలిసొచ్చిన ఐటీ, బ్యాంకింగ్ రంగ కొనుగోళ్లు
  • 200 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్
  • 10,863.50 వద్ద ముగిసిన నిఫ్టీ
  • 36,064 వద్ద ముగిసిన సెన్సెక్స్

పాకిస్థాన్ ఆర్మీ అధీనంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను కాస్త తగ్గించడమే కాకుండా స్టాక్ మార్కెట్‌కు కూడా అనుకూలంగా మారింది. మూడు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ సూచీలు కోలుకొని నేడు లాభాలతో ప్రారంభమై అదే జోరుతో ముగిశాయి. ఉదయం 200 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌కు ఐటీ, బ్యాంకింగ్ రంగ కొనుగోళ్లు కలిసొచ్చాయి.

నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి.. 10,863.50 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 196 పాయింట్లు లాభపడి 36,064 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్, హిందూస్థాన్ పెట్రోలియం, ఐసీఐసీఐ, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు మాత్రం నష్టపోయాయి.  

More Telugu News