ప్రత్తిపాడు వద్ద ఢీకొన్న రెండు ప్రైవేటు బస్సులు.. ముగ్గురికి తీవ్రగాయాలు!
- తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడులో ఘటన
- ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న బస్సులు
- క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై వైద్యులు స్పందిస్తూ క్షతగాత్రుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు. వారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.