ప్రతి భారతీయుడికీ ఇది శుభవార్త: రాబర్ట్ వాద్రా

  • అభినందన్ ను సురక్షితంగా వెనక్కి పంపుతుండటం సంతోషకరం
  • ఆయనను చూసి చాలా గర్విస్తున్నాం
  • శాంతి నెలకొనడం మనకు ప్రధానం

పాకిస్థాన్ ఆర్మీ అధీనంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు పాక్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించించిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ప్రకటనపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా స్పందిస్తూ, అభినందన్ ను సురక్షితంగా వెనక్కి పంపుతుండటం ఆయన కుటుంబానికి, ప్రతి భారతీయుడికీ శుభవార్త అని చెప్పారు. అభినందన్ ను చూసి అందరం చాలా గర్వపడుతున్నామని అన్నారు. దేశ రక్షణలో భారత భద్రతాదళాల స్థైర్యాన్ని చూసి గర్విస్తున్నామని చెప్పారు. శాంతి నెలకొనడం మనకు చాలా ప్రధానమని అన్నారు.

More Telugu News