Andhra Pradesh: ఏపీకి మోదీ ఎప్పుడొచ్చినా అది చీకటి రోజే!: సీఎం చంద్రబాబునాయుడు

  • మన హక్కులను మోదీ కాలరాశారు
  • ఏపీలో ఆయన పర్యటించేందుకు వీలులేదు
  • రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాకే అడుగుపెట్టాలి
ఏపీకి మోదీ ఎప్పుడొచ్చినా అది చీకటి రోజేనని సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో మాట్లాడుతూ, మన హక్కులను కాలరాసిన ప్రధాని మోదీ మన రాష్ట్రంలో పర్యటించడానికి వీలులేదని అన్నారు. ఏపీకి మోదీ రాకను నిరసిస్తూ ఈరోజు సాయంత్రం  కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని, రేపు నల్ల జెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తమ నేతలకు పిలుపు నిచ్చారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాకే ఈ రాష్ట్రంలో మోదీ అడుగుపెట్టాలని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరంగా గుర్తించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.
Andhra Pradesh
cm
Chandrababu
modi
pm

More Telugu News