Chalamasetty Sunil: నా వంటివారు రాజకీయాల్లో ఉండాలని చంద్రబాబు చెప్పారు.. అందుకే టీడీపీలో చేరుతున్నా: చలమలశెట్టి సునీల్

  • వైసీపీ వైఖరి నచ్చట్లేదు
  • మా మనోభావాలు దెబ్బతీసింది
  • రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా
తన వంటివారు రాజకీయాల్లో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని.. అందుకే టీడీపీలో చేరుతున్నానని చలమలశెట్టి సునీల్ తెలిపారు. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సునీల్ పోటీ చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ నాయకత్వ వైఖరి తనకు నచ్చట్లేదని.. తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ ఆరోపించారు. దీంతో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించానన్నారు. కానీ చంద్రబాబు తనను పిలిచి తనవంటి వారు రాజకీయాల్లో ఉండాలని చెప్పడంతో టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. సునీల్‌తో పాటు రేపు మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Chalamasetty Sunil
Chandrababu
YSRCP
Telugudesam
Kakinada

More Telugu News