Indian Airforce: గుంజన్ సక్సేనా బయోపిక్‌లో జాన్వీ కపూర్

  • శరణ్ శర్మ దర్శకత్వం
  • ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
  • ‘కార్గిల్ గాళ్’ అనే టైటిల్ ఫిక్స్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్‌కు పైలెట్‌గా బాధ్యతలు నిర్వహించిన గుంజన్ సక్సేనా జీవితాధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఆమె 1999లో కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఈ బయోపిక్‌లో లెజెండరీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ‘కార్గిల్ గాళ్’గా జాన్వీ కనిపించనుంది. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘కార్గిల్ గాళ్’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. గుంజన్ సక్సేనా జీవితం గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Indian Airforce
Kargil Girl
Janvi Kapoor
Gunjan Saxena
Sridevi

More Telugu News