Pakistan: పాక్‌కు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి: అమెరికాలో పాక్ మాజీ రాయబారి

  • చైనా సహా ఏ ఒక్క దేశం మద్దతివ్వలేదు
  • ఇరు దేశాలూ సంయమనం పాటించాలి
  • పాక్‌పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తోంది
ఉగ్ర స్థావరాలకు నెలవుగా మారిన దేశాలను ఇక ఏమాత్రం సహించబోరని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హుక్కానీ అన్నారు. ప్రస్తుతం హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌లో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న హుస్సేన్ మాట్లాడుతూ.. నిన్న పాక్‌పై భారత్ దాడుల అనంతరం చైనా సహా ఏ ఒక్క దేశం కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవలేదన్నారు.

ఇది పాకిస్థాన్‌కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. పాక్, భారత్ ఇరు దేశాలూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. పాక్‌కు ఏ ఒక్క దేశం కూడా మద్దతుగా నిలవకపోవడమనేది ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు.
Pakistan
chaina
Hussain Hukkani
India
Terrorism

More Telugu News