నయనతార సినిమాకి పెరిగిన వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నయనతార సినిమాకి పెరిగిన వసూళ్లు

  • తమిళంలో 'ఇమైక్కా నోడిగళ్'
  • ప్రధాన పాత్రధారిగా నయనతార
  •  తెలుగులోను పాజిటివ్ టాక్    
తమిళనాట నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక తెలుగులోనూ నయనతారకి పెద్ద సంఖ్యలోనే అభిమానులు వున్నారు. నాయిక ప్రాధాన్యత గల నయనతార సినిమాలు .. ఒక స్టార్ హీరో రేంజ్ వసూళ్లను రాబడుతున్నాయి. క్రితం ఏడాది ఆగస్టులో వచ్చిన 'ఇమైక్కా నోడిగళ్' అనే సినిమా ఇదే విషయాన్ని నిరూపించింది. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన తెలుగులో 'అంజలి సీబీఐ' పేరుతో విడుదల చేశారు.

రాంబాబు .. ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అనువాద చిత్రాలేవీ .. ఇక్కడి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో తొలి రోజున నామ మాత్రపు వసూళ్లనే ఈ సినిమా సాధించింది. ఇదే సమయంలో థియేటర్లకు వచ్చిన మిగతా సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈలోగా 'అంజలి సీబీఐ'కి మంచి టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఆల్రెడీ లాభాల బాట పట్టిందని చెప్పుకుంటున్నారు.
nayanatara

More Telugu News