కర్నూలు జిల్లాలో ప్రజల కష్టాలు విని కన్నీరు పెట్టుకున్న రేణూ దేశాయ్!
- కర్నూలు జిల్లాలో పర్యటించిన రేణు
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ
- న్యాయం జరిగేలా చూస్తానని హామీ
తమకు కనీసం తాగేందుకు మంచినీరు లేదని, పక్కా గృహాలు లేవని, బ్యాంకు రుణాలను చెల్లించలేకున్నామని రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. సమస్యలపై స్పందించిన రేణు, తాను ప్రజా ప్రతినిధిని, అధికారిణిని కాదని, అయినా, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.