jana sena: నేను ప్రజల మనిషిని, పార్టీల మనిషిని కాదు: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
తాను ప్రజల మనిషిని అని, పార్టీల మనిషిని కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలులో ఈరోజు నిర్వహించిన రోడ్ షో లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, జనసేన’ ఎప్పుడూ ప్రజల వైపే ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలో మార్పు రావాలని ప్రజలకు అనిపిస్తే చాలని, ‘జనసేన’ వారికి అండగా ఉంటుందని, ఆ మార్పు కోసం తన ప్రాణాలు కోల్పోయినా భయపడనని అన్నారు.

అవినీతి కోటలను బద్దలు కొట్టి కొత్త ప్రపంచాన్ని తీసుకొద్దామని, ‘మనం లేకుండా ఏపీ రాజకీయాలు ఉండవు’ అని పవన్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలు చాలా కీలకమని, అందరినీ సమానంగా భావించే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని పిలుపు నిచ్చారు. కులాలను విడదీసి కాదు, కులాలను కలిపి రాజకీయం చేయాలని, అదే జనసేన చేయబోయేది, చేస్తున్నది అని అన్నారు. రాయలసీమ అభివృద్ధి ‘జనసేన’తోనే సాధ్యమని అన్నారు.
Go Back to Shorts
jana sena
Pawan Kalyan
Kurnool District
rally

More Telugu News