chiranjerevi: 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసిన దర్శకుడు

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు సురేందర్ రెడ్డి 'సైరా' సినిమాను రూపొందిస్తున్నాడు. చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడైన 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఉయ్యాలవాడ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన అసలు చిత్రాన్ని దర్శకుడు సురేంద్రరెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

"మా హీరో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఇదే మా సెల్యూట్' అని నివాళులు అర్పిస్తూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఉయ్యాలవాడ అసలు చిత్రాన్ని చూస్తే దేశభక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలగక మానదు. అమితాబ్ .. నయనతార .. తమన్నా .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ వంటి భారీ తారాగణంతో రూపొందుతోన్న 'సైరా' సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి. చిరంజీవి కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రమవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
Go Back to Shorts
chiranjerevi
nayanatara
thamannah

More Telugu News