కశ్మీరీలను కాపాడే బాధ్యత నాదే.. జవాన్లపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం: మోదీ
- భారత్ చేస్తున్న పోరాటం కశ్మీర్ కోసమే
- కశ్మీరీలపై ఎవరూ దాడులకు పాల్పడవద్దు
- ఉగ్రవాదంపై పోరాటంలో కశ్మీరీ యువతను కలుపుకు పోవాలి
ఉగ్రవాదంపై పోరాటంలో కశ్మీరీ యువతను కలుపుకుని పోవడం ముఖ్యమని మోదీ అన్నారు. ఉగ్రవాదం వల్ల కశ్మీరీలు చాలా నష్టపోతున్నారని... వారిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.