కోడి కత్తి కేసులో రహస్య విచారణకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం.. ఇక వార్తలు బయటకు రాకూడదన్న ధర్మాసనం
- గతేడాది అక్టోబరు 25న జగన్‌పై దాడి
- విచారణ విషయాలు బయటకు వెల్లడి కావొద్దన్న కోర్టు
- నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఆదేశాలు
జగన్‌పై గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.