దిక్కు తోచని స్థితిలో దిగి రాక తప్పని పాక్.. ప్రభుత్వ అధీనంలోకి జైషే ప్రధాన కార్యాలయం!
- పుల్వామా దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
- ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన వైనం
- పంజాబ్ ప్రభుత్వ అధీనంలో జైషే కార్యాలయాలు
జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పంజాబ్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. బహావల్పూర్లోని ఆ సంస్థ పాలనా పరమైన కార్యాలయంతోపాటు అదే ప్రాంగణంలో ఉన్న రెండు ఇస్లామిక్ శిక్షణ సంస్థలను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించింది. ఈ సందర్భంగా పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జైషే సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.