relangi narasimharao: 'కొంటె కాపురం' నిర్మాతలతో గొడవ జరిగింది .. టైటిల్స్ లో నా పేరు తీసేశారు: దర్శకుడు రేలంగి నరసింహారావు

షార్ట్స్‌లో చూడండి
చంద్రమోహన్ .. తులసి జంటగా 'కొంటె కాపురం' సినిమా చేయడానికి రంగంలోకి దిగాను. తులసి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో, అశ్వనిని తీసుకున్నాము. వారం రోజుల్లో షూటింగ్ అనగా నిర్మాతకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రాజెక్టు ఆగిపోయిందని అనుకున్నాను .. కానీ వెంటనే కోలుకున్న ఆయన షూటింగ్ కానిచ్చేయమని చెప్పాడు. అలా షూటింగ్ జరుగుతున్నప్పుడే చెన్నైలో భారీ తుపాన్ వచ్చింది. అయినా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడానికి నానా కష్టాలు పడ్డాను.

ఇంతా చేస్తే సినిమా విడుదలకి ముందు, ఓ విషయంలో నిర్మాతలతో నాకు గొడవైంది. దాంతో వాళ్లు టైటిల్స్ లో అందరి పేర్లు ఉంచేసి, నా పేరును తీసేసి విడుదల చేశారు. 'అయ్యో మీ పేరు లేదేంటండీ' అంటూ ఆర్టిస్టులంతా నాకు ఫోన్లు. వెంటనే నేను ఈ విషయాన్ని దాసరిగారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన నన్ను .. నిర్మాతలను కూర్చోబెట్టి .. సమస్యను పరిష్కరించారు. ఆ తరువాత ఆ సినిమా టైటిల్స్ లో నా పేరు చేర్చారు. మొత్తానికి ఆ సినిమా బాగా ఆడింది .. అదే ఆనందం" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
relangi narasimharao

More Telugu News