పరిస్థితి బాగోలేదు.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి: హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లకు పాకిస్థాన్ సూచన
- బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దు.. ప్రసంగాలు వద్దు
- లోప్రొఫైల్ మెయింటైన్ చేయండి
- పుల్వామా దాడితో అంతర్జాతీయ సమాజం ముందు దోషిలా నిలబడ్డ పాక్
మరోవైపు, మరిన్ని ఇబ్బందులు ఎదురు కాకుండా దిద్దుబాటు చర్యలకు పాకిస్థాన్ దిగింది. కొంత కాలం మౌనంగా ఉండాలంటూ పుల్వామా ఘటనకు బాధ్యుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ లకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దని, ప్రసంగాలు ఇవ్వరాదని వీరిని కోరింది. లోప్రొఫైల్ మెయింటైన్ చేయాలని సూచించింది.