'సీబీఐ' నాగేశ్వరరావు నియామకంపై పిటిషన్ కొట్టివేత.. విచారణ అవసరం లేదన్న సుప్రీం
- సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకంపై ఎన్జీఓ సవాల్
- సీబీఐకు కొత్త డైరెక్టర్ ని నియమించారు
- ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు
అయితే, గతంలో జరిగిన ఈ తతంగంపై ‘కామన్ కాజ్’ అనే ఎన్జీవో ప్రశ్నించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీబీఐకు కొత్త డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లాను నియమించడం జరిగిందని, దీంతో ఇక, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతూ, సదరు పిటిషన్ ను తోసిపుచ్చింది. కాగా, ఈ నెల 4న సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఐపీయస్ అధికారి రిషి కుమార్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది.