అన్నాడీఎంకే-పీఎంకే మధ్య కుదిరిన పొత్తు.. 7 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిన అన్నాడీఎంకే!
- ఉపఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్న పీఎంకే
- నిర్ణయాన్ని ప్రకటించిన ఇరు పార్టీలు
- నేడు తమిళనాడులో పర్యటించనున్న మోదీ
ఇందుకు ప్రతిఫలంగా త్వరలో లోక్ సభ ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ సీట్లకు జరగనున్న ఉప ఎన్నికల్లో పీఎంకే అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వనుంది. ఈ నిర్ణయాన్ని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, పీఎంకే నేతలు అన్బుమణి రామ్ దాస్, ఎంకే మణి తదితరులు ప్రకటించారు. కాగా, నేడు ప్రధాని మోదీ తిరుపూర్, కన్యాకుమారిలో పర్యటించనున్న సందర్భంగా అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై కూడా క్లారిటీ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.