4జీ డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ కంపెనీలివే!
- తొలి స్థానంలో రిలయన్స్ జియో
- డౌన్ లోడ్ స్పీడ్ 18.7 ఎంబీపీఎస్
- రెండో స్థానంలో ఎయిర్ టెల్
- అప్ లోడ్ స్పీడ్ లో ఐడియా ఫస్ట్
ఇక జియోకు ప్రధాన పోటీదారు ఎయిర్ టెల్ విషయానికి వస్తే, డిసెంబర్ లో 9.8 ఎంబీపీఎస్ గా ఉన్న వేగం, జనవరిలో 9.5 ఎంబీపీఎస్ కు పడిపోయింది. వోడాఫోన్ నెట్ వర్క్ వేగం 6.3 ఎంబీపీఎస్ నుంచి 6.7 ఎంబీపీఎస్ కు మెరుగుపడింది. ఐడియా వేగం 6 ఎంబీపీఎస్ నుంచి 5.5 ఎంబీపీఎస్ కు తగ్గింది.
కాగా, అప్ లోడ్ వేగంలో మాత్రం ఐడియా ముందు నిలవడం గమనార్హం. జనవరిలో అప్ లోడ్ వేగంలో ఐడియా 5.8 ఎంబీపీఎస్ తో తొలి స్థానంలో ఉండగా, వోడాఫోన్ అప్ లోడ్ వేగం 5.4 ఎంబీపీఎస్ గా, జియో స్పీడ్ 4.4 ఎంబీపీఎస్ గా ఉంది. ఎయిర్ టెల్ 3.8 ఎంబీపీఎస్ అప్ లోడ్ స్పీడ్ తో నాలుగో స్థానంలో నిలిచింది.