Talasani: టీఆర్ఎస్ ఎమ్మెల్యేవా? లేక వైసీపీ ఏజెంటువా?: తలసానిపై ఏపీ వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఏపీ వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల మురళి మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని... ఏపీలో వైసీపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. బీసీలకు ఒక్క పాలకమండలిని కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే... అది తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

ప్రభుత్వం ఏర్పడి ఎన్నో రోజులు అవుతున్నా ఇంతవరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం చేతగాని మీరు... ఏపీకి వచ్చి నీతులు చెబుతున్నారా? అంటూ ఆయన మండిపడ్డారు. మరోసారి మంత్రి కావాలనే ఆశతోనే తలసాని నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో బీసీలను విస్మరిస్తున్న మీరు... పక్క రాష్ట్రానికి వచ్చి, బీసీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మురళి హెచ్చరించారు. మార్చి 2న హైదరాబాదులో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారని చెప్పారు.
Go Back to Shorts
Talasani
devalla murali
TRS
Telugudesam

More Telugu News