ajith: తెలుగు ప్రేక్షకుల ముందుకు 'విశ్వాసం'

షార్ట్స్‌లో చూడండి
అజిత్ కి ఈ ఏడాది ఆరంభంలోనే 'విశ్వాసం' భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. జనవరి 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా తమిళంలో భారీ వసూళ్లను రాబట్టింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను అదే సమయంలో తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన వాయిదా వేసుకున్నారు.

అలాంటి ఈ సినిమాను మార్చి1వ తేదీన విడుడల చేయడానికి రంగం సిద్ధమైంది. తెలుగులో అజిత్ కి మంచి క్రేజ్ వుంది .. ఇక నయనతారకి తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రను చేసింది జగపతిబాబు కావడం తెలుగు వెర్షన్ కి కలిసొచ్చే ప్రధానమైన అంశం. ఇక ఇదే రోజున విడుదల కానున్న కల్యాణ్ రామ్ '118' సినిమాకి, 'విశ్వాసం' పోటీ ఇచ్చేట్టుగానే కనిపిస్తోంది.
Go Back to Shorts
ajith
nayanatara

More Telugu News