ప్రకాశం జిల్లా పొదిలి పంచాయతీ రాజ్ డీఈఈ రవిప్రకాశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు!
- బంధువుల ఇళ్లు, ఆఫీసులో తనిఖీలు
- ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు
- ఇంకా కొనసాగుతున్న దాడులు
ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. రవిప్రకాశ్ కు చెందిన ఇళ్లు, ఆఫీసు నుంచి పలు కీలక డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయనీ, సాయంత్రం పూర్తి వివరాలు చెబుతామని అన్నారు.