అవంతి శ్రీనివాస్ ఇంటికెళ్లి వైసీపీలో చేరాలని ఆహ్వానించండి!: విశాఖ నేతలకు జగన్ ఆదేశం
- మధ్యాహ్నం 2 గంటలకు అవంతితో వైసీపీ నేతల భేటీ
- సాయంత్రం జగన్ ను కలుసుకోనున్న టీడీపీ నేత
- భీమిలి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అంగీకారం
తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అవంతి టీడీపీ అధిష్ఠానాన్ని కోరగా, ముందస్తు హామీ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాగా, అవంతికి భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అంగీకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేతలతో తన నివాసంలో భేటీ అనంతరం అవంతి శ్రీనివాస్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో జగన్ తో భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.