వైసీపీ కార్యకర్త శివతో నేను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
- ఒక రాజకీయ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను వేరే వాళ్లు చింపడం నేరం
- అలాంటి తప్పుడు పని చేసిన వాడికి ‘వార్నింగ్’ ఇచ్చా
- అంతేతప్ప, నేనేమీ తప్పు చేయలేదు
ఒక రాజకీయ పార్టీకి చెందిన జెండాలు లేదా ఫ్లెక్సీలను వేరే వాళ్లెవరైనా వాటిని చించినా, తొలగించినా నేరమని, అటువంటి తప్పుడు పని చేసిన వాడికి ‘అది తప్పు’ అని ‘వార్నింగ్’ ఇచ్చానని అన్నారు. అంతేతప్ప, తానేమీ తప్పు చేయలేదని, ఎవరితో నైనా నిర్భయంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. అతనికి, అతని కుటుంబానికి సాయం చేశానని, పెట్టే వాడికి దండించే అధికారం ఉంటుందని, అందుకే, తప్పుదోవలో ఉన్న శివను మందలించాల్సి వచ్చిందని కూన రవికుమార్ సమర్థించుకున్నారు.