తప్పకుండా తిరగబడతా.. కూన రవి కుమార్ ఎన్ని చెప్పినా వైసీపీ జెండా వదలను: వైసీపీ కార్యకర్త శివ
- కూన రవికుమార్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చా
- ప్రాణాల మీదకొస్తే ఎవరైనా తిరగబడకుండా ఉండరు
- చావనైనా చస్తా.., టీడీపీ జెండా మాత్రం పట్టుకోను
కూన రవికుమార్ ఎన్ని మాటలు చెప్పినా వైసీపీ జెండాను తాను వదలనని అన్నారు. చావనైనా చస్తానుగానీ, టీడీపీ జెండా పట్టుకుని మాత్రం తిరగనని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యవహారం విషయమై న్యాయపరంగా ఏ స్థాయికైనా వెళతామని, చట్టపరంగా అతన్ని కోర్టులో నిలబెడతామని పొందూరు ఎంపీపీ, వైసీపీ నాయకుడు గాంధీ అన్నారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించమని, టీడీపీ అక్రమాలపై పోరాడతామని అన్నారు.