'భీష్మ' షూటింగుకి ముహూర్తం ఖరారు
- 'ఛలో' తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
- నితిన్ హీరోగా తదుపరి సినిమా
- ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ నెల 25వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సితార బ్యానర్ పై ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. కొంతకాలంగా నితిన్ సక్సెస్ అనే మాటను వినలేదు. అందువలన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ సినిమాతో అయినా ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.