Encounter: న్యూఢిల్లీలో కాల్పుల కలకలం... ఈ ఉదయం ఎన్ కౌంటర్... ముగ్గురు దొంగల హతం!

షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధానిలో ఈ ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. దోపిడీకి వెళుతున్న కరుడుగట్టిన నేరస్థులను గమనించిన పోలీసులు ఎన్ కౌంటర్ చేసి ముగ్గురిని హతమార్చారు. న్యూఢిల్లీలోని రోహిణి సెక్టార్ 10 లోని ఓ పార్కు వద్ద నీరజ్ బవానియా గ్యాంగ్ పోలీసులకు తారసపడిన వేళ ఈ ఘటన జరిగింది.

పోలీసులపై నేరగాళ్లు సైతం కాల్పులు జరుపగా, బులెట్ ప్రూఫ్ లు ధరించి ఉండడంతో వారికి ముప్పు తప్పిందని డీసీపీ సంజీవ్ యాదవ్ తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని, వారిని అసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారని తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత ముగ్గురు నేరస్థులను అరెస్ట్ చేశామని అన్నారు. దోపిడీ దొంగలైన అర్పిత్ ఛిత్లార్, సునీల్ భూరా, సుఖ్విందర్ లు గాయపడ్డారని చెప్పారు. ఘటనా స్థలిలో పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Go Back to Shorts
Encounter
New Delhi
Police

More Telugu News