ప్రజల ఖాతాల్లో మోదీ డబ్బులు వేస్తున్నారని ప్రచారం.. ఖాతాలు తెరిచేందుకు ప్రజల పరుగులు!
- ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తున్నారని ప్రచారం
- పోస్టాఫీసు వద్ద చాంతాడంత క్యూ
- వదంతులు నమ్మొద్దన్నా పట్టించుకోని జనం
అంతే.. గ్రామస్థులు పోస్టాఫీసుకు పరుగులు తీశారు. ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. గ్రామస్థులందరూ పోస్టాఫీసు వద్ద క్యూ కట్టడంతో జాతరను తలపించింది. మహిళలు, పురుషులు క్యూల్లో గంటల కొద్దీ నిలబడ్డారు. ఈ వార్తలో నిజం లేదని, అదంతా అబద్ధమని చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఆకలి దప్పులు మరచిపోయి మరీ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపారు.