'నాగకన్య'గా వరలక్ష్మీ శరత్ కుమార్
- పాము నేపథ్యంలో సాగే కథ
- తమిళ టైటిల్ గా 'నీయా'
- త్వరలో ఆడియో రిలీజ్
వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి .. కేథరిన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 'జై' ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, తెలుగులో 'నాగకన్య' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్టు పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు.