ఖమ్మం జిల్లాలో కంపించిన భూమి.. పరుగులు పెట్టిన ప్రజలు
- అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు
- నిద్రపోతున్న వారు లేచి రోడ్లపైకి
- రాత్రంతా జాగారం
భూకంపంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు. మళ్లీ ఎక్కడ వస్తుందోనని రాత్రంతా జాగారం చేశారు. అయితే, అధికారులు మాత్రం అది భూకంపం కాదని, కేవలం చిన్నపాటి ప్రకంపనలేనని చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చే అవకాశం లేదని ధైర్యం చెప్పారు.