Madhulika: పుర్రె చిట్లిపోయింది... మధులిక పరిస్థితి అత్యంత విషమమన్న డాక్టర్లు!

షార్ట్స్‌లో చూడండి
తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఉన్మాదానికి లోనైన భరత్, కొబ్బరిబొండాలను కొట్టే కత్తితో దాడిచేయగా, తీవ్రంగా గాయపడి మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. మరో 48 గంటలు గడిస్తేగాని ఆమె పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమని వైద్యులు తెలిపారు.

ఆమె శరీరంపై 14 చోట్ల కత్తిగాట్లు ఉన్నాయని, తల పైభాగంలో పుర్రె రెండుగా చీలి, నరాలు తెగిపోయాయని, అంతర్గత రక్తస్రావం అధికంగా ఉందని అన్నారు. దవడ వద్ద, మణికట్టులపై, అరచేతులపై బలమైన గాయాలు ఉన్నాయని, చేతి వేళ్ల కీళ్లు విరిగి బయటకు వచ్చాయని అన్నారు. ఇప్పటివరకూ ఆమెకు 5 బాటిళ్ల రక్తం ఎక్కించామని, తెగి వేలాడుతున్న శరీర భాగాలకు కుట్లు వేశామని తెలిపారు.

ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చే సరికే పల్స్, బీపీ పడిపోయాయని, వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని వెల్లడించారు. రక్తస్రావం ఆగి, రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చిన తరువాత ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సివుందని చెప్పారు.
Go Back to Shorts
Madhulika
Bharat
Love
Hospital
Doctors

More Telugu News