ఫేస్ బుక్ లో పరిచయం... ప్రేమ పేరిట కోరిక తీర్చుకుని మోసం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ లో పరిచయం... ప్రేమ పేరిట కోరిక తీర్చుకుని మోసం!

  • హైదరాబాద్ అమ్మాయికి పరిచయమైన యువకుడు
  • పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం
  • పోలీసులను ఆశ్రయించగా, అరెస్ట్
సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో పరిచయమైన 17 సంవత్సరాల అమ్మాయికి, మాయమాటలు చెప్పి, ప్రేమించానంటూ, కోరిక తీర్చుకుని ఆపై దూరం పెట్టిన ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఫోక్సో కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, మెట్టుగూడకు చెందిన ఓ అమ్మాయికి అదే ప్రాంతంలోని సాయికిరణ్ అలియాస్ మున్నా (22)తో పరిచయం ఏర్పడింది. ఆపై వారు కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. పరిచయం స్నేహంగా మారి, వారిమధ్య ప్రేమకు దారితీసింది. అమ్మాయిని తరచూ కలుసుకునే మున్నా, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకున్నాడు. పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు.

చివరికి సదరు అమ్మాయి పెళ్లి ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు. నిలదీసి అడిగితే, కులం పేరుతో దూషించడంతో, ఆమె తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వంచకుడిని అరెస్ట్ చేశారు.
Facebook
Hyderabad
Police
Love
Arresrt

More Telugu News