ప్రభుత్వ పథకాల అమలులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి!: అధికారులకు చంద్రబాబు ఆదేశం
- అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్
- దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది
- టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఏపీలో ఎవ్వరినీ నిరాదరణకు గురికానివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. బీసీ కార్పొరేషన్ పరిధిలోకి రాని, అసలు కార్పొరేషన్ లేనివారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సూర్యబలిజ, కూరాకుల, అచ్చుకట్లవాండ్ల, జక్కల సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.