జీవీఎల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ
- నోటీసు ఇచ్చిన తెనాలి శ్రవణ్ కుమార్
- జీవీఎల్ ట్వీట్ ను నోటీసుకు జతచేసిన ఎమ్మెల్యే
- చంద్రబాబు పిచ్చి పీక్స్ కు చేరిందంటూ వ్యాఖ్యానించిన జీవీఎల్
'సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారితో ప్రవర్తించిన తీరు చూస్తే 'పిచ్చి పీక్స్ కు' చేరినట్టు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారు. సీఎంపై సభాహక్కుల నోటీసును ఇచ్చే ఆలోచన ఉంది' అని జీవీఎల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.