మా సినిమాలో అవకాశాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు: 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుముల
- నితిన్ హీరోగా 'భీష్మ'
- దర్శకుడిగా వెంకీ కుడుముల
- ఆ ప్రచారంలో నిజం లేదు
ఈ గ్రూపులో రోజురోజుకి సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో .. ఈ సినిమా టీమ్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందిస్తూ .."డబ్బు కడితే నితిన్ 'భీష్మ' సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఆ వాట్సాప్ గ్రూపుకి .. ఈ సినిమా యూనిట్ కి ఎలాంటి సంబంధం లేదు. కొత్తవాళ్లు అవసరమైతే యూనిట్ నుంచి కాస్టింగ్ కాల్ ప్రకటన వస్తుంది .. అంతేగానీ, మధ్యవర్తులను నమ్మేసి మోసపోవద్దు' అని స్పష్టం చేశాడు.