Andhra Pradesh: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు

  • అత్యద్భుతమైన రాజధాని నిర్మాణం చంద్రబాబుకే సాధ్యం
  • పేదల కోసం చంద్రబాబు సాహసోపేత నిర్ణయాలు
  • అన్నయ్య కృష్ణ ఆశీర్వదించారు
వైసీపీ నుంచి తాను ఎందుకు బయటకు వచ్చిందీ  సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వెల్లడించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దగల సామర్థ్యం ఒక్క చంద్రబాబుకే ఉందని, అత్యద్భుతమైన రాజధాని నిర్మాణం ఆయన వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆ విశ్వాసంతోనే తాను వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నట్టు చెప్పారు. ఇకపై ఘట్టమనేని కుటుంబం మద్దతు పూర్తిగా టీడీపీకేనని స్పష్టం చేశారు.  

పేదల సంక్షేమం కోసం చంద్రబాబు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆదిశేషగిరి రావు కొనియాడారు. తాను టీడీపీలోకి వెళ్లబోతున్న విషయాన్ని హీరో కృష్ణ, మహేష్‌బాబు అభిమానులతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. అన్నయ్య కృష్ణ కూడా తనను ఆశీర్వదించారని తెలిపారు. ఏడో తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ఆదిశేషగిరిరావు ప్రకటించారు.
Andhra Pradesh
Chandrababu
Super star krishna
Adiseshagiri Rao
Telugudesam

More Telugu News