Chigurupati Jayaram: జయరాం కేసులోకి ఎంటరైన నిర్మాత.. శిఖా చౌదరిని తప్పించేందుకేనా?

  • జయరాం మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు
  • ఆమెను తప్పించేందుకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశ చూపుతున్నట్టు వార్తలు
  • స్టేషన్‌కు వచ్చి శిఖా కారును తీసుకెళ్లిన సినీ నిర్మాత
కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసు సూత్రధారిగా భావిస్తున్న శిఖా చౌదరిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. సినీ నిర్మాత కేపీ చౌదరి ఈ కేసులోకి ఎంటర్ కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

శుక్రవారం రాత్రి నందిగామలో శిఖా చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శిఖాను ఈ కేసు నుంచి తప్పించేందుకు దర్యాప్తు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశ చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శిఖా కోసం స్టేషన్‌కు వచ్చిన సినీ నిర్మాత కేపీ చౌదరి ఆమె కారును తీసుకెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమెను తప్పించేందుకే ఆయన సీన్‌లోకి ఎంటరైనట్టు చెబుతున్నారు. కాగా, అమెరికా నుంచి వచ్చిన జయరాం కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. జయరాం భార్య వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
Chigurupati Jayaram
Shikha choudary
Producer
KP Choudary

More Telugu News