Narendra Modi: మోదీ, మమత ఇద్దరూ దొందూ దొందే: సీతారాం ఏచూరి

  • చౌకీదార్ మోదీ దేశాన్ని దోచేస్తున్నారు
  • మమతా బెనర్జీ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు
  • మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైంది
ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ దేశాన్ని దోచుకుంటుంటే, మమత రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. చౌకీదార్‌గా చెప్పుకునే మోదీ ప్రజల కలలను అమ్మి దేశాన్ని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని దోచుకుతినే చౌకీదార్ (కాపలాదారు) మనకి అవసరం లేదన్నారు. ఆయనను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు.

పాలసీల పేరుతో ఇన్నాళ్లూ ప్రజలను దోచుకుతిన్న మోదీ ఎన్నికలు దగ్గరపడగానే ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారని సీతారాం ఏచూరి మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రజల జేబులకు కన్నాలు పెడుతున్నారని ఆరోపించారు.  
Narendra Modi
Mamata Banerjee
Sitaram Yechury
Kolkata
West Bengal

More Telugu News