అమెరికాలో జనాల్ని చంపేస్తున్న చలి.. 12 మంది మృతి
- అమెరికాను బెంబేలెత్తిస్తున్న చలిపులి
- మైనస్ 46 డిగ్రీలకు చేరిక
- వృద్ధులు, నిరాశ్రయుల కోసం వార్మింగ్ కేంద్రాల ఏర్పాటు
మరో 24 గంటలపాటు ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోనే ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు విపరీతంగా కురుస్తుండడంతో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వృద్ధులు, నిరాశ్రయుల కోసం వందలాది వార్మింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.