సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కేథరిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కేథరిన్

  • యూత్ లో కేథరిన్ కి మంచి క్రేజ్
  • విజయ్ దేవరకొండ జోడీగా ఒక సినిమా
  • తొలిసారిగా లేడి ఓరియెంటెడ్ మూవీ  
గ్లామర్ పరంగాను .. నటన పరంగాను కేథరిన్ ను పక్కన పెట్టేయలేము. యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ వుంది .. కళ్లతోనే హావభావాలను పలికించగల నేర్పు కేథరిన్ సొంతం. అయితే ఇంతవరకూ ఆమె నటనను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే పాత్ర పడలేదనే చెప్పాలి. అందువల్లనేనేమో .. తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాసరెడ్డి .. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా నాయిక ప్రధానంగా సాగే కథ అని సమాచారం. ఈ పాత్రకి కేథరిన్ అయితే బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం కేథరిన్ .. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోంది. 
catherine

More Telugu News