'జయహో బీసీ' హామీలపై కసరత్తు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు కేబినెట్
- 9న సామూహిక గృహ ప్రవేశాల పండుగ
- ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్
- రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాల అందజేత
ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. రాబోయే మూడేళ్లలో దీని కోసం రూ.260 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. విశాఖ జిలాల్లోని ఆనందపురం గిడిజాల గ్రామంలో మహిళా పారిశ్రామిక వేత్తలకు 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 9న రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాలను, అర్బన్‌లో లక్ష, రూరల్‌లో 3 లక్షల గృహాలను లబ్దిదారులకు అందజేయనున్నారు.