Chandrababu: ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి: చంద్రబాబు ఆదేశాలు

షార్ట్స్‌లో చూడండి
వచ్చే నెల 11న ఢిల్లీలో నిర్వహించే ధర్మపోరాట దీక్షకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ హాజరు కావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించే ధర్మపోరాట దీక్షలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనే నిమిత్తం విజయవాడ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. వచ్చే నెలాఖరు నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉందని అన్నారు.

  వచ్చే నెల 2,3,4 తేదీల్లో పింఛన్ల పండగ జరపాలని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛన్ల పండగను పేదల పండగగా, సంక్షేమ ఉత్సవాలుగా జరపాలని సూచించారు. ఈ సందర్భంగా ‘యువ నేస్తం’ భృతిని రూ.2 వేలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్న విషయాన్ని పార్టీ నేతలకు చెప్పారు. వచ్చే నెల 9న నాలుగు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టనున్నామని, రైతులకు, కౌలు రైతులకు మేలు చేసేలా వినూత్న పథకాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
cm
New Delhi
mla`s

More Telugu News