వేధిస్తున్న యువకుడి కిడ్నాప్.. మిత్రులతో చితకబాదించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని!
- సికింద్రాబాద్ లో ఘటన
- తన స్నేహితులతో కలిసి స్కెచ్ వేసిన ఉద్యోగిని
- ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదిన వైనం
ఈ క్రమంలో ఆ యువకుడిని సికింద్రాబాద్ కు రమ్మనమని చెప్పడంతో అతను అక్కడికి వెళ్లాడు. దివ్య, ఆమె స్నేహితులు అతన్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందడంతో వారు రంగంలోకి దిగారు. ఈ కేసును గంటలోపే ఛేదించారు. దివ్యతో పాటు ఆమె స్నేహితులను అరెస్టు చేశారు.