తెలంగాణలో కూలిన ‘డబుల్ బెడ్రూమ్’ భవనం శ్లాబు.. నలుగురు కార్మికుల దుర్మరణం!

  • మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఘటన
  • తీవ్రంగా గాయపడ్డ నలుగురు కార్మికులు
  • కేసు నమోదుచేసిన పోలీసులు
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఈరోజు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ భవనం శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈరోజు భనవం పదో అంతస్తులో పనులు జరుగుతుండగా శ్లాబు పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని తోటి కార్మికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిల్డర్ నిర్మాణంలో నాణ్యత పాటిస్తున్నారా? కార్మికుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Go Back to Shorts
Telangana
ACCIDENT
double bedroom
4 dead
Police
Medchal Malkajgiri District

More Telugu News