akhil: ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు: హీరో అఖిల్

షార్ట్స్‌లో చూడండి
సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జునకి ఎంతో అనుభవం వుంది. అందువలన ఆయన చైతూ సినిమాల విషయంలోను .. అఖిల్ సినిమాల విషయంలోను కేర్ తీసుకుంటూ వుంటారు. దాంతో ఈ ఇద్దరి కెరియర్ ను నాగార్జున పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చైతూను క్లాస్ హీరోగా .. అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అఖిల్ కి ఎదురుకావడంతో ఆయన స్పందిస్తూ, "ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. అటు చైతూకి .. ఇటు నాకు తొలి అడుగుల సమయంలో నాన్న వెంటే ఉండటం వలన అలా అనిపించిందేమో. నిజానికి ఆయన మా కెరియర్ ను కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. తనవంతుగా సలహాలు .. సూచనలు ఇస్తారంతే. ఆ తరువాత ఆయన మాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. నాన్న సినిమాల్లో 'హలో బ్రదర్' .. 'మన్మథుడు' ఇష్టం. ఇక 'పుష్పక విమానం'లో అమ్మ నటన నచ్చుతుంది" అని అన్నాడు.
Go Back to Shorts
akhil

More Telugu News