payal: ఐటమ్ సాంగ్ కోసం రంగంలోకి దిగిన పాయల్ రాజ్ పుత్

షార్ట్స్‌లో చూడండి
తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ 'రామ్' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హాట్ హాట్ గా అనిపించే ఒక ఐటమ్ సాంగ్ వుందట. ఈ ఐటమ్ సాంగ్ ఏ కథానాయిక చేయాలనే విషయమై చాలామంది పేర్లను పరిశీలించిన తేజ, చివరిగా 'పాయల్ రాజ్ పుత్'ను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు.

'ఆర్ ఎక్స్ 100' సినిమాలో పాయల్ ఒక రేంజ్ లో అందాలను ఆరబోసింది. ఆమె అందాలు కుర్రకారు మనసులను దోచేసుకున్నాయి. తేజ అడగ్గానే ఆమె కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. ఇందుకుగాను ఆమెకు భారీ పారితోషికమే ముట్టిందని అంటున్నారు. త్వరలోనే ఆమెపై ఈ పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
payal

More Telugu News