తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఘట్టంలో చివరి అంకం... బారులు తీరిన ఓటర్లు!
- ప్రారంభమైన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- నేడు 3,529 పంచాయతీల్లో పోలింగ్
- 32,055 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఓటర్లు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరగా, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ పూర్తి కానుండగా, ఆపై సాయంత్రంలోగా ఓట్ల లెక్కింపును పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 7,043 పంచాయతీలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.