ఫెర్నాండెజ్ మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను: కృష్ణంరాజు
- ఫెర్నాండెజ్ నాకు గురు సమానులు
- కేంద్ర మంత్రిగా ఆయన సేవలు మరువలేనివి
- ఆయన మరణం దేశానికి తీరని లోటు
కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సీనీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ, ఫెర్నాండెజ్ తనకు గురుసమానులని చెప్పారు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కేంద్ర మంత్రి ఫెర్నాండెజ్ చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఫెర్నాండెజ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.