ఓవర్ సీస్ లో 'అఖిల్', 'హలో' కలెక్షన్లను దాటని 'మిస్టర్ మజ్ను'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓవర్ సీస్ లో 'అఖిల్', 'హలో' కలెక్షన్లను దాటని 'మిస్టర్ మజ్ను'!

  • తగ్గిన ప్రీమియర్ షో కలెక్షన్లు
  • రూ. 57.62 లక్షలు మాత్రమే
  • బయ్యర్లకు నష్టమేనంటున్న ట్రేడ్ వర్గాలు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన 'మిస్టర్ మజ్ను' ఓవర్ సీస్ లో అనుకున్నంత కలెక్షన్లను దాటలేకపోయింది. అఖిల్ తొలి రెండు సినిమాలు 'అఖిల్', 'హలో'లకు వచ్చిన ప్రీమియర్ షో కలెక్షన్లను కూడా ఈ చిత్రం సాధించలేకపోయింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో 'మిస్టర్  మజ్ను' విఫలం కావడంతోనే తొలి వారాంతంలోనే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని తెలుస్తోంది. 'అఖిల్' సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా రూ. 64 లక్షలకు పైగా రాగా, ఆ తరువాత వచ్చిన 'హలో'కు దాదాపు రూ. 1.50 కోట్లు వచ్చాయి. ఇక, 'మిస్టర్ మజ్నూ' కలెక్షన్లు రూ. 57.62 లక్షలు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రెండు సినిమాలతో పోలిస్తే, మూడో చిత్రం కలెక్షన్ల విషయంలో మరింత నిరుత్సాహపరిచిందని, బయ్యర్లు నష్టపోయారని అంటున్నారు.
Akhil
Hello
Mr. Majnu
Overseas
Collections

More Telugu News